నగరంలో నిరాశ్రయులయిన బాధితులకు అండగా హెల్ప్ ఫౌండేషన్

ముత్యాల రాందాస్ ఆధ్వర్యంలో సాగుతున్న “హెల్ప్ ఫౌండేషన్ లాక్ డౌన్ ఈ సమయంలో కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని హై జెనిక్ ఫుడ్ ప్యాకెట్స్ పంచి పెట్టారు తాజాగా ఈరోజు చిలకలగూడ , ప్యారడైజ్ ,సికింద్రాబాద్, బేగంపేట్, పరిసర ప్రాంతాల్లో భోజనం ప్యాకెట్లు అందజేశారు హెల్ప్ పౌండేషన్ తరుపున అత్యంత నిరుపేద కుటుంబాలకు, వలస కార్మికులకు మరియు కూలీలకు బిర్యానీ , మామిడి కాయలు మరియు వాటర్ పాకెట్స్ అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీకాంత్ రెడ్డి గారు , సతీష్ శర్మ గారు ,రమేష్ గారికి నా ధన్యవాదాలు .

ఈ సందర్భంగా ముత్యాల రాందాస్ మాట్లాడుతూ…కరోనా టైమ్ లో మా హెల్ప్ ఫౌండేషన్ తరుపున రోజు కి వెయ్యి మందికి పైగా రెండు పూటల భోజనం ఇస్తున్నామని తెలిపారు.
యువత సేవా గుణాన్ని అలవరచుకుని తోటి మనుషులకు సహాయపడి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి నశించిపోతున్న మానవ విలువలను బ్రతికించాలని కోరుకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here