Home Entertainment Bazaar Rowdy Unit wishes Sampoornesh Babu on his Birthday

Bazaar Rowdy Unit wishes Sampoornesh Babu on his Birthday

0
456

బ‌ర్నింగ్ స్టార్‌ సంపూర్ణేష్ బాబు కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ “బజార్ రౌడీ” యూనిట్‌

 

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొద‌టి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. 1000 సినిమాలకు పైగా ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ సినిమాకి పనిచేశారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే ఈ బ‌జార్‌ రౌడీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న‌వంతుగా స‌హ‌య కార్య‌క్ర‌మాల ద్వారా స‌హ‌య‌ప‌డే బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టిన‌రోజు ( మే 9న ) సంద‌ర్బంగా అభిమానులు స‌హ‌య కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అలాగే మా బజార్ రౌడి యూనిట్ అంతా ఆయ‌న‌కి శుభాకాంక్ష‌లు తెలుపుకుంటున్నారు.

 

 

నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: వసంత నాగేశ్వరరావు
నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత- శేఖర్ అలవలపాటి
సమర్పణ: బోడెంపూడి కిరణ్ కుమార్
బ్యానర్: కె ఎస్ క్రియేషన్స్
మాటలు: మరుధూరి రాజా
సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ
ఎడిటింగ్: గౌతం రాజు
సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here