వ‌ర్షా విశ్వ‌నాథ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన `రెడ్డిగారింట్లో రౌడీయిజం` చిత్ర యూనిట్‌

డెబ్యూ హీరోయిన్ వ‌ర్షా విశ్వ‌నాథ్ పుట్టిన‌రోజు నేడు(మే 3). ఈ సంద‌ర్భంగా ఆమె హీరోయిన్‌గా న‌టించిన‌ `రెడ్డిగారింట్లో రౌడీయిజం` టీమ్ ఆమెకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సీనియ‌ర్ న‌టి వాణీ విశ్వ‌నాథ్ సోద‌రి కుమార్తె అయిన వ‌ర్షా విశ్వ‌నాథ్‌.. వాణీ విశ్వ‌నాథ్ అడుగుజాడ‌ల్లో సినీ రంగ ప్ర‌వేశం చేశారు.

 

ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా  సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `రెడ్డిగారింట్లో రౌడీయిజం` చిత్రంలో గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ పాత్ర‌లో వ‌ర్షా విశ్వ‌నాథ్ న‌ట‌న అంద‌రినీ మెప్పిస్తుంద‌ని.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఉన్న ఈ చిత్రాన్ని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here