డబ్బింగ్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న “మనం సైతం”

నిరంతర సేవా కార్యక్రమం మనం సైతం మరో ఆపన్నురాలికి అండగా నిలిచింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆరాధన పెండెం ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఆరాధన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మనం సైతం సంస్థ నుంచి 25 వేల రూపాయలను ఇవాళ ఆరాధన పెండెం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకున్న మనం సైతం కాదంబరి కిరణ్ గారికి ఆరాధన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నిస్సహాయులను, పేదలను ఆదుకునేందుకు ఒక జీవనదిలా మనం సైతం సేవా కార్యక్రమం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా మనం సైతం ఫౌండర్ కాదంబరి కిరణ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here