శివ కంఠమనేని, ప్రియా హెగ్డ్ హీరో హీరోయిన్లుగా, కొత్త, పాత నటీనటులతో పాటు, ఓ ప్రముఖ హీరో అతిధి పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “మణిశంకర్”. లైట్ హౌస్ సినీ మ్యాజిక్, శ్రీ గురు క్రియేషన్స్ బ్యానెర్లపై నిర్మాతలు కె.ఎస్. శంకర్రావు, ఏ.వి.ఎస్. శ్రీనివాస్, ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రం తాలూకా సాంగ్స్ రికార్డింగ్ పూజ కార్యక్రమాలు ఏప్రిల్ 15వ తేదీ, గురువారం మధ్యాహ్నం 3 గం. 48 ని.లకు మొదలయ్యాయి.

ఇక ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె), సంగీతం – ఎం.ఎల్.రాజా, డి.ఓ.పి. -వరం, డి. ఐ. – రాజ్ రెడ్డి, ఎడిటర్-సత్య గిదుటూరి, గేయరచన – అనంత్ శ్రీరామ్, బాలభాస్కర్, రచనాసహకారం- శ్రీనాథ్. టి., బ్రాండింగ్ కన్సల్టెంట్-మురళికృష్ణ, పబ్లిసిటీ డిజైనింగ్-పార్టు క్రియేషన్స్ వారు అందిస్తున్నారు. అలాగే ఈ మణిశంకర్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని, చాలా ఆసక్తికరమైన సీన్ పేని పేకకులు బాగా ఎంజాయ్ చేసారని దర్శకుడు తెలిపారు.

 

దర్శకుడు జి.వి. కె. చాలా టాలెంటెడ్ అని, సబ్జెక్టు నరేషన్ బట్టి అర్ధమవుతుందని, ఒక హిట్ సినిమాలో నటిస్తున్నాము అనే కాన్ఫిడెన్స్ మాకు ఉందని హీరో హీరోయిన్స్ శివ కంఠమనేని, ప్రియా హెగ్లే తెలిపారు. మంచి మేకింగ్ వాల్యూస్ తో మణిశంకర్ సినిమా నిర్మిస్తున్నామని, జూన్, జూలై, ఆగస్టు నెలలలో షూటింగ్ జరుపుకుని, దసరాకు సినిమా విడుదల చెయ్యాలని నిర్మాతలు, కె.ఎస్. శంకర్రావు, ఏ.వి.ఎస్.శ్రీనివాస్, ఫణిభూషణ్ ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here