ఏప్రిల్ 23న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో రిలీజ్ అవుతున్న ‘చావు కబురు చల్లగా’
కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగ‌ళ్ల‌పాటి కౌశిక్ తెర‌కెక్కించాడు. ఏప్రిల్ 23న ఈ సినిమా హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…
లావ‌ణ్య త్రిపాఠి(జూమ్‌కాల్‌లో) మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం  ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. విల‌క్ష‌ణ‌మైన పాత్ర చేశాను. ఈ సినిమా ‘ఆహా’లో విడుదలవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ ‘‘ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ స్టార్ట్ చేసి సమయంలో ఇదొక రియలిస్టిక్ పాయింట్ అనే స్టార్ట్ చేశాం. రిలీజ్ తర్వాత ఆ పాయింట్ అనుకున్నంతగా రీచ్ కాలేదు. అందుకు కారణం థియేటర్‌కి ప్రేక్షకులు చాలా తక్కువ మంది వచ్చారు. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. సినిమా నచ్చినవాళ్లు చాలా మంచి మెసేజ్‌లు ఇచ్చారు. నచ్చనివారు చెప్పిన పాయింట్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఎడిట్ చేశాం. థియేటర్ కంటే బెటర్ కట్ చేశాం. కొత్త పాయింట్ అనుకుని స్టార్ట్ చేసిన ఈ సినిమాను ఇంకా బెటర్‌గా ‘ఆహా’లో విడుదల చేస్తున్నాం. రీ ఎడిట్ చేస్తానని అనగానే బన్నీవాస్‌గారు, అల్లు అరవింద్‌గారు చాలా సపోర్ట్ చేశారు. మా హీరో కార్తికేయ కూడా డబ్బింగ్ చెప్పడానికి ముందుకు వచ్చారు. వారందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘‘ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, బన్నీవాస్‌గారికి థాంక్స్. ‘ఆహా’ వారికి స్పెషల్ థాంక్స్. ఎందుకంటే.. మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతాం. మా సినిమా  ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ విషయానికి వస్తే నా మనసుకు దగ్గరైన సినిమా. ఈ సినిమా చూసిన వారు నా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అన్నారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన కౌశిక్‌కి థాంక్స్. చాలా ఈజ్‌గా చేయించారు. ఈ సినిమాతో నన్ను చూసే కోణం మారింది. నేను సినిమాలు ఎంపిక చేసుకునే కోణం మారింది. నా దగ్గరకు వచ్చే కథలు మారుతున్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు.
‘ఆహా’ సీఈఓ అజిత్ ఠాగూర్ మాట్లాడుతూ ‘‘ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ పైసా వసూల్ కమర్షియల్ మూవీ. దర్శకుడు కౌశిక్, హీరో కార్తికేయ  సినిమా కనెక్ట్ కాలేకపోయిందని అంటున్నారు కానీ.. వాళ్లు చాలా మంచి సినిమా చేశారు. మా ఇంటర్ననల్ స్క్రీనింగ్ కమిటీ సినిమాకు చాలా మంచి రేటింగ్ ఇచ్చింది. థియేటర్ రిలీజ్ తర్వాత ‘ఆహా’లో ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తుందనగానే కౌశిక్ ఇంకా బెటర్ ఎడిట్ వెర్షన్ ఇస్తానని మా ముందుకు వచ్చాడు. కార్తికేయ మరోసారి డబ్బింగ్ కూడా చెప్పాడు. వారిద్దరూ సినిమాపై ఉన్న ఆసక్తిని అంత గొప్పగా చూపించారు. సినిమా సెకండ్ ఛాన్స్‌లో తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here