రొమాంటిక్ ఫ్యామిలీ  ‘తారామణి’

తేదీ : సెప్టెంబరు 06, 2019

నటీనటులు : వసంత రవి, ఆండ్రియా జెర్మియా, అంజలి

దర్శకత్వం : రామ్

నిర్మాత‌లు : ఉదయ్ హర్ష వడ్డెల, డి. వెంకటేష్

సంగీతం : యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫర్ : ఏ. శ్రీకర్ ప్రసాద్

కథ: అథియా(ఆండ్రియా) స్వతంత్ర్య భావాలు కలిగిన ఉద్యోగిని. ఆమె ఒక రోజు అనుకోకుండా ప్రేమలో విఫలమై డిప్రెషన్ లోఉన్న ప్రభు(వసంత రవి)ని కలుస్తుంది. ఆ పరిచయం కాస్తా పెద్దదై వారు కలిసి సహజీవనం చేసే వరకు వెళుతుంది. మరి ఆ కొత్త బంధంలో ఏర్పడిన సమస్యలేమిటి? వారు వారి జీవితాలను ఎలా బ్యాలన్స్ చేశారు? వారి బంధం చివరికి ఎలా ముగిసింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: లివింగ్ రిలేషన్స్ కాన్సెప్ట్ తో… ఇండిపెండెంట్ విమెన్ సెంట్రిక్ స్టోరీలను ఆసక్తికరంగా మలిస్తే… బాక్సాఫీసు వద్ద కాసులు కురియడం ఖాయం. తారామణ డైరెక్టర్ చేసింది కూడా అదే. యూత్ కి నచ్చేలా వాస్తవికతకు దగ్గరగా కథ.. కథనాలను రాసుకుని తెరకెక్కించి ఆడియన్స్ ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సాధారణంగా తమిళ చిత్రాలన్నీ చాలా నాచురల్ గా వుంటాయి. ఎలాంటి కమర్షియల్ హంగులను అనవసరంగా ప్రేక్షకులపై రుద్దకుండా.. వాస్తవానికి దగ్గరగా స్టోరీలను మలచడంలో వారు ముందు ఎప్పుడూ వుంటారు. తారామణి కథ.. కథనాలు కూడా అంతే. నేల విడిచి సాము చేయకుండా… చాలా సింపుల్ నేరేషన్ తో ఆడియన్స్ ను రెండుగంటల పాటు సీట్లో కూర్చొబెట్టడంలో విజయం సాధించారు. కథ.. కథనాలకు తోడు ఆండ్రియా… వసంత రవిల మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. సో.. గో అండ్ వాచ్ ఇట్..

మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన ఆండ్రియా… వసంత రవిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఆండ్రియా అందాలు కుర్రకారును విపరీతంగా ఆకర్షిస్తాయి. ప్రత్యేక పాత్రలో కనిపించిన అంజలి నటన ఆకట్టుకుంటుంది. కాసేపే కనిపించినా… అంజలి అలరించింది.


ఆత్మాభిమానం, స్వతంత్ర్య భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో ఆండ్రియా పాత్ర అద్భుతంగా ఉంది. సాఫ్ట్ వేర్ వుద్యోగం చేసే అమ్మాయి పాత్రలో ఆమె చక్కగా సరిపోయారు. ప్రథమార్థంలో వచ్చిన రెండు పాటలు బాగున్నాయి. అలాగే వసంత రవి కూడా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా అలరించాడు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. తాము ప్రేమించిన వారి ప్రేమ, ఆప్యాయతలు తమకు మాత్రమే చెందాలని భావించే నేటి యువతలో ఉండే తత్వాన్ని సహజంగా చక్కగా చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో కనెక్ట్ అవుతారు.ఎంచుకున్న కాన్సెప్ట్ ని వాస్తవికతకు దగ్గరగా తీయడం బాగుంది. దీనిపైనే దర్శకుడు ఎక్కువగా దర్శకుడు రామ్ దృష్టిసారించి విజయం సాధించారు. అనవసర కమర్షియల్ అంశాలజోలికి వెళ్లేదు.

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్స్
కథ

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
అక్కడ అక్కడ బోరు సన్నివేశాలు

చివరి మాట : చాలా నాచురల్ గా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండు. తేని ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆండ్రియా, వంసత రవిల మధ్య కెమిస్ట్రీని చక్కగా ఎలివేట్ చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన బీజీఎమ్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

రేటింగ్: 3.5/5