విజయవాడలో నివసించిన లారా అనే వ్యక్తి జీవితం ఆధారంగా నిర్మించిన ‘రంగు’ సినిమా పై అభ్యతరాలు ఉన్నాయని ‘లారా’ కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
దిలీప్ (లారా బావ మరిది) :
ఏడాది క్రితం లారా (పవన్ కుమార్) గురించి విజయవాడలో సమాచారం సేకరించ డానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్ మీట్ చూసాము.
లారా అనే రౌడీ షీటర్ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలు అయ్యింది. లారా మీద రౌడీ షీట్ అన్యాయం గా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదుకు కుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి. లారా కొంతమంది దృష్టిలో రౌడీ కావొచ్చు, కానీ లారా ఎంత మంచి వాడో విజయ వాడ లో చాలామంది కి తెలుసు. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుండి దర్శక నిర్మాతల ను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా ముందు మాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అంగీకారం తోనే సినిమా రిలీజ్ చేయాలి. లేదంటే సినిమా రిలీజ్ ని లీగల్ గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ కూడా పడనీయం.
లారా గురించి వీరికి అసలు ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాం ?

సందీప్ మాట్లాడుతూ ( లారా స్నేహితుడు ) :
“విజయవాడ అంటే సినిమా దర్శకులకు రౌడీ షీ టర్స్ మాత్రమే గుర్తుకు వస్తారా ?
లారా మీద సినిమా వస్తుంది అనగానే దర్సకుడి నెంబర్ తీసుకొని మాట్లాడాము. ఆయన చూద్దాం అని తర్వాత మా కాల్ కి రెస్పాన్స్ అవడం లేదు. వ్యక్తుల జీవితాలపై సినిమా చేసే తప్పుడు వారి కుటుంబం నుండి అనుమతి తీసుకోవాలి. నిర్మాత గాని దర్శకుడు కానీ ఆ పని చేయలేదు. లారా ని చంపేయలి అనే డైలాగ్ తో ట్రైలర్ కట్ చేశారు. ఆ మాట వారి పై ఎంత ప్రభావం చూపుతుందో ఆలోచించారా…?
మేము ముందుగా సినిమా చూడాలి…మాకు అభ్యతరాలు ఉంటే సినిమా ను ఆపేస్తాము.. మాకు సినిమా చూపించకుండా రిలీజ్ చేస్తే లీగల్ గా కోర్ట్ కి వెళతాం. ఇంకా ఎంత దూరం అయినా వెళతాం. ” అన్నారు.

ధనుంజయ్
(లారా స్నేహితుడు )
మాట్లాడుతూ :
” గతం మరిచి పోయి బతుకు తున్న లారా ఫ్యామిలీ ఈ సినిమా తో మళ్ళి భయం, భయం గా బతుకు తుంది.
లారా కథ ను తెలుసు కోకుండా సినిమా తీశారు. వారికి ఆ కథ పై ఎలాంటి హక్కు లేదు. సినిమా దర్శకుడు ఈ విషయం పై మాట్లాడితే రెస్పాన్డ్ అవలేదు. మేము రెండు రోజులు గడువు ఇస్తున్నాం. మాకు సినిమా చూపించి , మాకు అభ్యంతరం అనిపించే సన్నివేశాలను తొలిగించాలి. లేదంటే సినిమా ను ఆపేందుకు ఎంత దూరం అయినా వెళతాం” అన్నారు.

రంగు సినిమా ఈ నెల 23 న విడుదలకు సిద్ధం అవుతుంది.