తాజ్ మహల్, పెళ్లి సందడి, క్షేమం గా వెళ్లి లాభం గా రండి వంటి ఎన్నో ఫామిలీ చిత్రాలలో నటించి మంచి ఫ్యామిలీ హీరో గా ముద్రవేసుకున్నాడు హీరో శ్రీకాంత్. ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకునే హీరో శ్రీకాంత్ ఒక వైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మరో వైవు ఖడ్గం, మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్ లాంటి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు కూడా చేసి తనలోని విలక్షణ నటుడుని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం లో స్థానం సంపాదించుకున్నాడు. కాలానికి అనుగుణంగా మారుతూ హీరో పాత్రలే కాకుండా మంచి క్యారెక్టర్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. శంకర్ దాదా జిందాబాద్, గోవిందుడు అందరివాడు, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించాడు.

1991 లో పీపుల్ ఎన్ కౌంటర్ చిత్రం తో మొదలైన తన నటన ప్రస్థానం 27 ఏళ్ళ గా కొనసాగుతూనే ఉంది. ఈ 27 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అవార్డులు మరెన్నో తీపి గుర్తులు.

ఇప్పుడు తన స్వీయ సమర్పణలో అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీమతి అలివేలు నిర్మాతగా కరణం బాబ్జి దర్శకత్వం వహించిన చిత్రం “ఆపరేషన్ 2019”. సమాజానికి మంచి చేయాలన్న ఉదేశ్యం తో బయలు దేరిన వ్యక్తికి రాజకీయ నాయకులూ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ప్రజల నుండి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అందుకు భగవద్గీత లో చెప్పబడిన సామ దాన దండోపాయాలు ఉపయోగించి రాజకీయ నాయకులకు వారిని ఎన్నుకునే ప్రజలకు వారి వారి బాధ్యతలు గుర్తు చేస్తూ సమకాలీన అంశమైనా ఎన్నికల మీద ఒక విభిన్న కథాంశం తో అతి త్వరలో మన ముందుకు వస్తున్న చిత్రం ఆపరేషన్ 2019.

ఈ చిత్రం ఘన విజయం విజయం సాధించాలని కోరుతూ మా ఆపరేషన్ 2019 టీం తరపున ప్రేక్షక దేవుళ్ళకి దీపావళి శుభాకాంక్షలు .