సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనే టాక్‌తో తొలి రోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 46.77 కోట్లరూపాయ‌ల షేర్‌ను సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్షన్స్‌ను సాధిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో….

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ మాట్లాడుతూ తెలుగు సినిమా ఆడియ‌న్స్ కీ, నాన్న‌గారి అభిమానుల‌కీ, నా అభిమానుల‌కీ సిన్సియ‌ర్ గా ధ‌న్య‌వాదాలు. జ‌న‌వ‌రి 11నే సంక్రాంతిని మాకు ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే నేను, దిల్‌రాజుగారు, అనిల్ సుంక‌ర క‌లిసి షేర్స్ మాట్లాడుకుంటూ మిరాకిల్స్ ఫీల‌య్యాం. నిజంగా మైండ్ బ్లాక్ అయింది. హ్యాట్సాఫ్ టు తెలుగు సినిమా. టెక్నీషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్. త‌మ్మిరాజు, శేఖ‌ర్ మాస్ట‌ర్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఆర్టిస్టులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. రిలీజ్ రోజు సినిమాను నా పిల్ల‌ల‌తో చూస్తాను. అది నాకు సెంటిమెంట్‌. నేను నిన్న పిల్ల‌ల‌తో సినిమా చూసి విజ‌య‌శాంతిగారిని ఈవెనింగ్ క‌లిశాను. ఆ కేర‌క్ట‌ర్‌ను ఆవిడ త‌ప్ప‌, ఇంకెవ‌రూ చేయ‌లేరు. ఇంత‌కు ముందు కూడా ఈ విష‌యాన్ని చెప్పాను. ఇప్పుడు మ‌ళ్లీ చెబుతున్నాను. ఈ ప్రాజెక్టులో ఆవిడ ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది. నాకు బాగా న‌చ్చిన టెక్నీషియ‌న్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్ మాస్టార్లు. వాళ్లు ఎప్పుడూ ఆడియ‌న్స్ లాగా ఉంటారు. టెక్నీషియ‌న్లు లాగా ఉండ‌రు. అందుకే అనిల్ రావిపూడిగారిని వాళ్ల‌కు క‌థ చెప్ప‌మ‌ని అడిగాను. దూకుడు త‌ర్వాత నేను చేసిన సినిమాల‌న్నీ గొప్ప సినిమాలు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి.. ఇలా! వాటికి ఎక్క‌డో స్క్రిప్ట్ కి స‌రెండ‌ర్ అయిపోవాలి. ఇందాక మాస్ట‌ర్స్ అన్న‌ట్టు నాన్న‌గారి అభిమానులుగానీ, నా అభిమానులుగానీ, జ‌న‌ర‌ల్ ఆడియ‌న్స్ గానీ, మ‌హేష్ బాబును దూకుడులో చూసుకున్న‌ట్టు ఫీల‌య్యార‌ని నాకు అనిపించింది. అనిల్‌గారు నాకు క‌థ చెప్పిన‌ప్పుడు నేను ఎగ్జ‌యిట్‌మెంట్ ఫీల‌య్యాను. కానీ అప్పుడే చేయ‌డానికి నాకు వేరే క‌మిట్‌మెంట్లు ఉన్నాయి. అందుకే ఒన్ ఇయ‌ర్ త‌ర్వాత చేద్దామ‌ని అన్నా. కానీ ఎఫ్‌2 చూసిన త‌ర్వాత ఆయ‌న చెప్పిన క‌థ‌ను ఇమీడియేట్‌గా చేస్తే బావుంటుంద‌ని అనిపించింది. వెంట‌నే ఆయ‌న‌తో విష‌యం చెప్పాను. ఆయ‌న రెండు నెల‌ల్లో మొత్తం స్క్రిప్ట్ రాసి తెచ్చేశారు. ర‌ష్మిక సినిమా షూటింగ్ అప్పుడు ఇన్ని మంచి మాట‌లు చెప్ప‌లేదు. పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తే ఇన్ని మంచి మాట‌లు చెప్పింది. నిన్న‌టి నుంచి నేను ఫీల‌యిన ఎగ్జ‌యిట్‌మెంట్‌, జ‌ర్నీ కొత్త‌గా అనిపించింది. నాన్న‌గారి అభిమానులు, నా అభిమానులు చెప్పిన తీరు కొత్త‌గా అనిపించింది. ఆ ఫుల్ క్రెడిట్ అనిల్ రావిపూడికి ఇస్తున్నాను. ఈ క‌థ చెప్పిన ద‌గ్గ‌రి నుంచీ, షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఇవాళ వ‌చ్చిన రెస్పాన్స్ ను ఆయ‌న ఊహిస్తూనే ఉన్నారు. దేవి నాకు ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్‌. అందుకే అది దేవి చేతుల్లో ఉందంటే నాకు ఆనందంగా ఉంటుంది. అల్లూరి సీతారామ‌రాజు సీన్ వ‌చ్చిన‌ప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విని నాకు గూస్ బంప్స్ వ‌చ్చాయి. దానిక‌న్నా మైండ్ బ్లాక్ సాంగ్‌ను కంపోజ్ చేసి, న‌న్ను క‌న్విన్స్ చేశారు.. ఇవాళ దానికి వ‌స్తున్న రియాక్ష‌న్ చాలా బాగా వ‌స్తోంది. నాకు చాలా కొత్త ఎక్స్ పీరియ‌న్స్. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి రియాక్ష‌న్ ఎప్పుడూ చూడ‌లేదు. అనిల్ సుంక‌ర‌గారు మా ఇంటిలోని వ్య‌క్తిలాగా. ఆయ‌న‌కు నాన్న‌గారంటే చాలా ఇష్టం. ఏవ‌న్నా న‌చ్చితే బాడీ లాంగ్వేజ్‌లో చూపిస్తారు. రెండు రోజులుగా ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌లో నాకు అది మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దిల్‌రాజుగారితో నాది హ్యాట్రిక్ కాంబినేష‌న్‌. ఆయ‌న‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొడ‌తాం. ఈ సినిమా హిట్ ఇచ్చినందుకు నాన్న‌గారి అభిమానులు, నా అభిమానులు, మా టెక్నీషియ‌న్స్ త‌ర‌ఫున అనిల్ రావిపూడిగారికి హ‌గ్ ఇస్తున్నాను అని అన్నారు.

న‌ట విశ్వ‌భార‌తి విజ‌య‌శాంతి మాట్లాడుతూ – 13 ఏళ్ల త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. అస‌లు సినిమాలే చేయాల‌ని భీష్మించుకు కూర్చున్న నన్ను డైరెక్ట‌ర్ అనిల్ గారు క‌లిసి మంచి పాత్ర మీరు త‌ప్ప‌కుండా చేయాల‌న్నారు. నేను కొంత స‌మ‌యం తీసుకుని ఆలోచించాను. క‌థ విన్నాను. న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ సినిమా చేసే స‌మ‌యంలో మంచి అనుభూతినిచ్చింది. ముఖ్యంగా మ‌హేశ్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా అనిపించింది. మ‌హేశ్‌తో చిన్న‌ప్పుడు కొడుకు దిద్దిన కాపురం ఆయ‌న‌తో చాలా పెద్ద హిట్ అనే సంగ‌తి అంద‌రికీ తెలుసు. త‌ర్వాత మ‌హేశ్‌గారు సూప‌ర్‌స్టార్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ క‌లిస న‌టించాను. ఇప్పుడు ఈ సరిలేరు నీకెవ్వ‌రు కూడా అంతే పెద్ద హిట్ అయ్యింద‌ని తెలియ‌జేసుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు అద్భుతంగా చేశార‌ని మెచ్చుకున్నారు. మీరు మ‌మ్మ‌ల్ని ఏడిపించార‌ని అన్నారు. గ‌తంలో నేను చేసిన ఓసేయ్ రాములమ్మా.. ప్ర‌తి ఘ‌ట‌న‌, క‌ర్త‌వ్యం చిత్రాల్లో చాలా బరువైన పాత్ర‌లు చేశాను. అలాగే ఇప్పుడు చేసిన స‌రిలేరు నీకెవ్వ‌రు పాత్ర అంతే బ‌రువైన పాత్ర‌. ఈ పాత్రను బ్యాలెన్స్‌గా చేసుకుంటూ పోవాలి. అలాగే చేసుకుంటూ వెళ్లాను. ముఖ్యంగా చివ‌రి సీన్ చేసేట‌ప్పుడు పొద్దున నుండి సాయంత్రం వ‌ర‌కు అక్క‌డే కూర్చున్నాను. ఎందుక‌నో తెలియ‌దు ఆ పాత్ర చేసేట‌ప్పుడు నాకు మ‌న‌సులో ఏదో తెలియ‌ని బాధ ఉండింది. సాధార‌ణంగా అలాంటి స‌న్నివేశాల్లో న‌టించేట‌ప్ప‌డు గ్లిజ‌రిన్ వాడుతారు. నేను గ్లిజ‌రిన్ వాడ‌లేదు. ఆ సీన్‌లో లీన‌మైపోవ‌డంతో క‌న్నీళ్లు ఆగ‌లేదు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు ప్ర‌తి డైలాగ్, సీన్‌ను గుర్తు పెట్టుకుని చెబుతున్నారంటే సినిమా ఎంత పెద్ద హిట్ట‌య్యిందో అర్థ‌మ‌వుతుంది. జ‌వాన్ల త‌ల్లిదండ్రులు ఎంత త్యాగం చేశారో అర్థ‌మైంది. జ‌వాన్ త‌ల్లిగా న‌టించ‌డం వ‌ల్ల మ‌ద‌ర్ ఇండియా అయ్యాను. అంత గొప్ప పాత్ర‌ను ఇచ్చిన అనిల్‌గారికి థ్యాంక్స్‌. నాది, బాబుది అంద‌మైన జ‌ర్నీ అని చెప్పాలి. మా మ‌ధ్య చాలా మంచి సీన్స్ కుదిరాయి. సినిమాలో ప‌నిచేసిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు అభినంద‌న‌లు అన్నారు.

ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ – ఈ సినిమా కాశ్మీర్ షూటింగ్ స‌మ‌యంలో నేను దేవిశ్రీగారి ద‌గ్గ‌ర రెండు మాట‌లు తీసుకున్నాను. అందులో మొద‌టిది అంద‌రు హీరోలు స్టేజ్ ఎక్కిన‌ప్పుడు మీ మ్యూజిక్ విన‌ప‌డుతుంటుంది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ మా హీరోకు విన‌ప‌డాలని.. నెక్ట్స్ టైమ్ మ‌హేష్‌గారు స్టేజ్‌పైకి రాగానే ఆయ‌న పాట వ‌స్తుంది. టైటిల్ సాంగ్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇస్తుంది. త‌ర్వాత ప‌క్కా మాస్ కావాలని అడిగాను. అప్పుడు త‌ను మైండ్ బ్లాక్ సాంగ్ ఇచ్చాడు. ప్ర‌తి ఫ్యాన్స్‌ ఆ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తూ కేరింత‌లు కొడుతున్నారు. మాకు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చి అనిల్ మాట నిల‌బెట్టుకున్నాడు. దూకుడు త‌ర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేసేట‌ప్పుడు అనిల్ రావిపూడిని క‌థ చెప్ప‌డానికి పంపిన‌ప్పుడు వ‌చ్చిన‌ప్పుడు ఈరోజు అంద‌రూ సినిమాను బ్లాక్‌బ‌స్ట‌ర్ కా బాప్ అంటున్నారుగా.. దాన్ని నేను ఆరోజు ఊహించాను. మ‌హేశ్‌గారి అంచ‌నాల‌ను అందుకున్నామ‌ని అనుకుంటున్నాం. మ‌హేశ్ అభిమానులు... ఆయ‌న్ని ఎలా చూడాల‌నుకున్నారో. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలా చూడాల‌నుకున్నారో ఆ అంశాల‌న్నింటినీ ఈ సినిమాలో యాడ్ చేశాం. మా మాట నిల‌బెట్టుకున్నాం. థియేట‌ర్‌లో సినిమా చూస్తున్న‌ప్పుడు మేం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశాం. దానికి ప‌దింత‌ల రెస్పాన్స్ వ‌స్తుంది. అది క‌లెక్ష‌న్స్ రూపంలో క‌న‌ప‌డుతుంది. విజ‌య‌శాంతిగారి రీ ఎంట్రీ మీద చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాటిని ఆమె రీచ్ అయ్యారు. విజ‌య‌శాంతిగారి ఎమోష‌న్‌కి అంద‌రూ క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. ర‌ష్మిక చ‌క్క‌గా న‌టించింది. దిల్‌రాజుగారితో మంచి అసోసియేష‌న్‌ను ఎంజాయ్ చేశాం. ఇంట‌ర్వెల్‌బ్లాక్‌లో అద‌ర‌గొట్టేలా చూపించారు రామ్‌లక్ష్మ‌ణ్‌. త‌మ్మిరాజుగారు, యుగంధ‌ర్‌గారు, కౌముది, రాజేంద్ర‌ప్రసాద్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా కోసం ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డ్డాం. ఈ సినిమాలో చ‌రిత్ర‌లో మిగిలిపోతుంది. ఏ ఆగ‌స్ట్ 15, జ‌న‌వ‌రి 26, ఏ పార్టీ వ‌చ్చినా, ఇన్‌స్పిరేష‌న్ సాంగ్ కావాల‌న్నా ఈ సినిమాలో పాట‌లు విన‌ప‌డుతాయి. మ‌హేశ్‌గారితో జ‌ర్నీ చాలా, గొప్ప అంద‌మైన జ‌ర్నీ. తొలిరోజున బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తెలుగు సినిమా చరిత్ర‌లోనే తొలి రోజున సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ 50 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ను క‌లెక్ష‌న్స్ రూపంలో పొందారు. ఇది ప్రారంభం మాత్ర‌మే అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్‌రాజు మాట్లాడుతూ – ఈ సినిమా కోసం ప‌నిచేస‌న ప్ర‌తి ఒక్క‌రికీ కంగ్రాట్స్‌. నిన్న‌రాత్రి నా లైఫ్‌లో టిపిక‌ల్ నైట్‌గా భావించాను. రాత్రి రెండున్న‌ర గంట‌ల ప్రాంతంలో నిద్ర‌లేచి కారులో జూబ్లీహిల్స్ అంతా తిరిగాను. త‌ర్వాత ఫోన్స్ రావ‌డం మొద‌ల‌య్యాయి. యూనిట్ స‌భ్యులు ఎప్పుడు మేల్కొంటారోన‌ని ఎదురుచూశాను. ఇదొక మెమొరీగా మిగిలిపోతుంది. ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్‌. మ‌హేశ్‌గారితో మూడు సినిమాలు చేస్తే హ్యాట్రిక్ కొట్టేశాను. ప్రొడ్యూస‌ర్‌గా ఆ క్రెడిట్ ఆయ‌న‌తో నాకే ద‌క్కింది. అనిల్‌తో ఎప్పుడు ఎటాచ్ అయ్యిందో కానీ.. అలా కుదిరింది. నాలుగు సినిమాలు చేస్తే నాలుగూ స‌క్సెస్ అయ్యాయి. చాలా మంది ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేశాను. చాలా మందితో వ‌ర్క్ చేశాను. కానీ అంద‌రీ కంటే అనిలే ముందున్నాడు. దేవితో 12 సినిమాలు చేశాను. త‌న‌కు థ్యాంక్స్‌. విజ‌య‌శాంతిగారి రీ ఎంట్రీ మా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో కావ‌డం చాలా సంతోషంగాఉంది. సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సంద‌ర్భంగా ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నాను. నైట్ క‌లెక్ష‌న్స్ చూస్తే మాకే మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంకా పండ‌గ ఉంది. ఈ సినిమాతో పండ‌గ ముందే వ‌చ్చింది. పండ‌గ‌కి ఇంకా అద్భుత‌మైన ఫ‌లితాలు చూస్తాం. మ‌హేశ్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిలింగా రెవెన్యూ ప‌రంగా నిల‌బ‌డుతుంద‌ని గ్యారంటీ ఇస్తున్నాను. మేం ఆల్ రెడీ పండ‌గ చేసుకుంటున్నాం. మాతో పాటు అంద‌రూ పండ‌గ బాగా చేసుకోవాల‌నుకుంటున్నాం అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమాకు ప‌నిచేసిన టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. ర‌త్న‌వేలుగారికి థాంక్యూ. ఆయ‌న అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. కాశ్మీర్ ఎపిసోడ్, క‌ర్నూల్ ఎపిసోడ్‌, విజ‌య‌శాంతి - హీరో మ‌ధ్య ఉండే ఎపిసోడ్స్ అన్నిటిలోనూ చాలా బాగా విజువ‌ల్స్ ఇచ్చారు. ప్ర‌కాష్ గారు అద్భుత‌మైన సెట్స్ వేశారు. ఎడిట‌ర్ త‌మ్మిరాజు నాతో ఉండి స‌పోర్ట్ చేశారు. నా మెయిన్ రైటింగ్ టీమ్ కృష్ణ రెండు ఏరియాలు కొనుక్కుని గుంటూరు, వెస్ట్ మొత్తం తిరుగుతున్నారు. నా డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్‌కి థాంక్స్. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు. అనిల్ సుంక‌ర‌గారికి థాంక్స్. ఆయ‌న న‌న్ను ఎక్క‌డా టెన్ష‌న్ పెట్ట‌లేదు. రాజుగారితో నా జ‌ర్నీ కొన‌సాగుతూ ఉంది. ఆయ‌న‌కు చాలా థాంక్స్. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న అద్భుత‌మైన పాట‌లిచ్చారు. రీరికార్డింగ్ బావుంది. సంగీత‌గారి క‌మ్‌బ్యాక్ బావుంది. ర‌ష్మిక మేన‌రిజ‌మ్స్ బావున్నాయి. కౌముది, ప‌ల్ల‌వి చాలా బాగా చేశారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారికి, ప్ర‌కాష్‌రాజ్‌గారికి థాంక్స్. విజ‌య‌శాంతిగారు ఈ పాత్ర‌ను అవ‌లీల‌గా చేశారు. ఆవిడ ఎక్స్ పీరియ‌న్స్ అందుకు ప్ర‌ధాన కార‌ణం. ఆవిడ‌కి ధ‌న్య‌వాదాలు. ఆమె పాత్ర‌కు ఆమె త‌ప్ప ఇంకెవ్వ‌రూ రీప్లేస్ చేయ‌లేరు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చే సీన్లు చాలా బావున్నాయి. ఈ సినిమాలో మీ వేల్యూ ఏంటో నెక్స్ట్ వీక్ కూడా తెలుస్తుంది. ఆమెను అభిమానించే వాళ్లు నెక్స్ట్ వీక్ కూడా థియేట‌ర్ల‌కు వెళ్తారు. ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అని ట్యాగ్‌లైన్ పెట్టాం. సినిమా హిట్టును బ‌ట్టి, దానికి ఓ ట్యాగ్‌ను అటాచ్ చేస్తారు ఏ సినిమా వాళ్లైనా. మా సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అని పెట్టారు. ఎందుకు పెట్టామంటే... ఈ సినిమాకు నిన్న‌టి నుంచీ బొమ్మ దద్ద‌రిల్లిపోయింది అని అంటున్నారు. సినిమా ఓపెనింగ్ విజ‌య‌శాంతిగారి పాత్ర‌, పేట్రియాటిజ‌మ్‌, ట్ర‌యిన్ ఎపిసోడ్‌, యాక్ష‌న్‌.. సెకండాఫ్‌లో హీరోగారికి, విజ‌య‌శాంతిగారికి మ‌ధ్య వ‌చ్చే డైలాగులు, ప్ర‌కాష్‌రాజ్‌గారి సీన్లు, హీరోగారు మాట్లాడే పొలిటిక‌ల్ విష‌యాలు, ఆ త‌ర్వాత విజ‌య‌శాంతిగారికీ - హీరోగారికీ మ‌ధ్య వ‌చ్చే సీన్లు.. ఇలా ప్ర‌తి పార్టు గురించీ ట్యాగ్ చేసి చెబుతున్నారు. దాంతో ఎంత క‌నెక్ట్ అయ్యారో అర్థ‌మైంది కాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అని పెట్టాం. బాహుబ‌లిలో శివుడిని తీసుకెళ్లిన‌ట్టు న‌న్ను ప్ర‌జ‌లు తీసుకెళ్తుంటారు. ఈ మూవీలో మ‌హేష్ గారు కూడా ఉన్నారు. ఈ సినిమాను ఎక్క‌డ తీసుకెళ్లి కూర్చోబెడుతారో వ‌చ్చే వారం తెలుస్తుంది. ఈ చిత్రంలో అజ‌య్ చాలా మంచి పాత్ర చేశారు. నేను కూడా ఎగ్జ‌యిట్ అయిన విష‌యం ఈ చిత్రంలోని అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌. ఆ పాత్ర‌ను అనుకుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి. హీరోగారు అడుగు పెట్టిన‌ప్పుడ‌ల్లా అజ‌య్ సీతారామ‌రాజు అని అంటుంటే, దానికి దేవిశ్రీ ప్ర‌సాద్ రీరికార్డింగ్ తోడై గూస్ బంప్స్ వ‌చ్చాయి. అల్లూరి సీతారామ‌రాజు ఎపిసోడ్ రావ‌డానికి కార‌ణం రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌. నేను క‌థ చెప్పిన‌ప్పుడు ఇంట్ర‌వెల్‌లో ఫోర్సు కావాల అని అన్నారు. వాళ్ల వ‌ల్లే రెండు రోజులు ఆలోచించి ఇది పెట్టాం. వాళ్ల జ‌డ్జిమెంట్‌కీ, ఎక్స్ పీరియ‌న్స్ కీ చాలా థాంక్స్. ఈ సినిమా సోల్‌ని ఆర్మీ బేస్‌లో చేశాం. ఇవాళ మ‌ధ్యాహ్నం ఒక‌మ్మాయి మెసేజ్ చేశారు. వాళ్ల ఫాద‌ర్ ఆర్మీ లో ప‌నిచేస్తార‌ని అన్న‌ప్పుడు ఆనందంగా అనిపించింది. మ‌న‌కోసం కాప‌లా కాసే సోల్జ‌ర్లు.. మ‌నం బాధ్య‌త‌గా ఉండాల‌ని కోరుకుంటార‌ని హీరోగారితో చెప్పించాం. ఆ కంటెంట్ కూడా జ‌నాల్లోకి రీచ్ అయింది. మ‌హేశ్‌గారి గురించి ఎంత చెప్పిన త‌క్కువే. సినిమా జ‌ర్నీ అంత ఒక ఎత్తు.. సినిమా మార్నింగ్ షో త‌ర్వాత నేను పొందిన అనుభూతి వేరు. ప్రేక్ష‌కుల నుండి వ‌స్తోన్న స్పంద‌న చూస్తుంటే నేనేనా ఈ సినిమాను తీసింది అనే ఫీలింగ్ క‌లిగింది. నాకు డైరెక్ష‌న్ అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థ్యాంక్స్‌. సినిమాకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు మంచి ఫ‌న్‌, మెమొరీస్ తీసుకెళ్తారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌ అన్నారు.

దేవిశ్రీ మాట్లాడుతూ మ‌న‌కు ఓ సినిమాకు మంచి పేరు రావాలంటే అవ‌కాశం చాలా ముఖ్యం. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే టాలెంట్ మ‌నం చూపించుకోగ‌లం. అలా ఇప్ప‌టిదాకా అవ‌కాశం రూపంలో నాకు వ‌చ్చిన ప్ర‌తి సినిమాకు థాంక్స్. అలాంటి అద్భుత‌మైన సినిమాకు స్క్రిప్ట్ రాసి డైర‌క్ట్ చేసిన అనిల్ రావిపూడిగారికి, ఈ సినిమాలో న‌టించిన మ‌హేష్ గారికి, నాతో 12 సినిమాల అనుబంధం ఉన్న దిల్‌రాజుగారికి, అనిల్ సుంక‌ర‌గారికి ధ‌న్య‌వాదాలు. దిల్‌రాజుగారిలాగా అనిల్ సుంక‌ర కూడా స్వీటెస్ట్ ప్రొడ్యూస‌ర్‌. మేం అన్ని పాట‌లు రెడీ చేస్తుండ‌గా, యు.ఎస్‌.కివెళ్లి యాంథ‌మ్ చేద్దామ‌ని అన‌గానే అనిల్ సుంక‌ర‌గారు ఎంతో ఎంక‌రేజ్ చేశారు. మా టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. వాళ్లంద‌రూ నాతో ఉండి న‌న్ను ఎప్పుడూ ఎంక‌రేజ్ చేస్తారు. ప్ర‌తి మండే ప్ర‌తి సాంగ్‌నీ జ‌నాల‌కు చేర‌వేసిన మీడియాకు థాంక్స్. అనిల్ రావిపూడికి ధ‌న్య‌వాదాలు. ఎఫ్‌2 చేసిన‌ప్పుడు అనిల్‌ని చూశాను. ఆయ‌న క‌థ చెప్పిన‌ప్పుడు సినిమా చూసిన‌ట్టు అనిపిస్తుంది. నేను క‌థ‌ను విన్న‌ప్పుడు ఎంత థ్రిల్ అయ్యానో, సినిమా చూసిన‌ప్పుడు కూడా అలాగే భావించాను. ర‌ష్మిక మంచి జాబ్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ గీత గోవిందంలో న‌చ్చింది. ఈ సినిమాలో కామెడీ చేసి డ‌బ్బింగ్ చెప్ప‌డం బావుంది. సంగీత‌గారికి బ్యూటీఫుల్ రీ ఎంట్రీ. ఆమె మ్యాన‌రిజ‌మ్ చాలా బావుంది. కౌముది అంద‌రూ బాగా చేశారు. రామ్‌ల‌క్ష్మ‌ణ్‌గారి ఫైట్స్ బాగా ఇన్‌స్ప‌యిరింగ్‌గా అనిపించాయి. రీరికార్డింగ్ చాలా బాగా వ‌చ్చిన ప్ర‌తిసారీ ఎప్పుడూ డైర‌క్ట‌ర్‌కి, హీరోకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. రీరికార్డింగ్‌ని దేవీ బాగా చేస్తాడ‌నే న‌మ్మ‌కం మ‌హేష్గారికి ఎప్పుడూ ఉంటుంది. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాల‌న్న త‌ప‌న నాకు రెట్టింపుగా ఉంటుంది. ఆయ‌న‌కు ఎన్ని థాంక్స్ లు చెప్పినా త‌క్కువే. ఆయ‌న‌మీద నాకున్న గ్రాట్యుట్యూడ్‌కి అక్ష‌ర‌రూపం ఇవ్వ‌లేను. ఈ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్‌గా చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మా నాన్న‌గారితో ప‌నిచేశారు విజ‌య‌శాంతిగారు. నాకు శ‌త్రువు ఫేవ‌రేట్ సినిమా. ఆమె సినిమాల‌ను త‌మిళ్‌లోనూ చూసేవాడిని. అని చెప్పారు.

ర‌ష్మిక మాట్లాడుతూ స్క్రీన్ మీద ఆడియ‌న్స్ కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నే సంగ‌తి నేను న‌టిని అయ్యాక తెలుసుకున్నా. మ‌హేష్ గారి కామెడీ టైమింగ్‌, డ్యాన్సులు ఈ సినిమాలో స‌ర్‌ప్రైజ్‌. ఆయ‌న్ని స్క్రీన్ మీద చూడ‌టం ట్రీట్‌. నా ఏడేళ్ల చెల్లెలు మ‌హేష్ గారిని చూడాల‌ని అడుగుతోంది. విజ‌య మేడ‌మ్ కేర‌క్ట‌ర్ చాలా స్ట్రాంగ్‌. చాలా అంద‌గ‌త్తె. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారి సంగీతం చాలా బావుంది. నా డ్యాన్సుల‌ను ఈ సినిమాలో తొలిసారి చూశారు. అనిల్‌గారికి, దిల్‌రాజుగారికి పండ‌గ స్టార్ట్ అయింది. ఈ టీమ్‌తో ప‌నిచేయ‌డం చాలా బావుంది. సంస్కృతి పాత్ర‌లో బాగా చేశాన‌ని అనుకుంటున్నా. నాకు ఆ కేర‌క్ట‌ర్‌కు కావాల్సిన బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్ తెలియ‌దు. అన్నీ డైర‌క్ట‌ర్ నేర్పించారు. నేను ఆర్మీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చాను. మా అమ్మ‌కు బాగా క‌నెక్ట్ అయింది అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో అజ‌య్‌, త‌మ్మిరాజు, యుగంధ‌ర్‌, చిట్టి, కౌముది త‌దిత‌రులు పాల్గొన్నారు.