సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాబిన్ వుడ్ వారి సహకారంతో ఈరోజు జూన్ ఏడు ఆదివారం నాడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు నిత్యఅవసర సరుకులను సంజన మరియు సృజన గార్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంజన మరియు సృజన మాట్లాడుతూ… ప్రముఖ కెమెరామెన్ నాగబాబు ద్వారా తెలుసుకొని తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు నిత్యఅవసర సరుకులను అందజేసామని , మిగతా యూనియన్లుకు వాళ్ళ అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నామన్నారు.

సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.శ్రీను , ట్రెజరర్ భద్రమ్ మాట్లాడుతూ… మా కుటుంబ సభ్యులాంటి యూనియన్ మెంబెర్లు అందరూ క్రమశిక్షణతో సోషల్ డిస్టన్స్ పాటించి ఈ కార్యక్రమన్నీ విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.