మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ‌క్ష‌న్ నెం 3 ని మొద‌లుపెట్ట‌బోతున్నారు. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. న‌వంబ‌ర్ 13న ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లోగోని లాంచ్ చేయనున్నారు. రవితేజ త‌న‌ కెరీర్ లో తొలిసారిగా సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ… ముందుగా తెలుగు ప్రేక్షకులందరు ఈ దీపావళిని ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మాస్ మహారాజా రవితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఓ  సైంటిఫిక్ కథలో మొద‌టిసారిగా ర‌వితేజ‌ నటించనున్నారు. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటున్నాం. అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. నవంబ‌ర్13న సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు‌ లోగోని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.