ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ”తో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి హీరోగా తెలుగులో మరో సినిమా త్వరలో మొదలు కానుంది. “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” అనంతరం ‘మెర్సిడీస్’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు రాజ్ దాసిరెడ్డి. ఈ చిత్రం ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, 2022లో విడుదల కానుంది!!