సూపర్ స్టార్ మహేష్, నమ్రత ల ఔదార్యం గురించి తెలిసిందే. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తమ సంపాదనలో కొంత భాగం ఛారిటీ కి కేటాయిస్తూ అనాథ పిల్లల కి చేయూత అందిస్తుంటారు. అత్యాధునిక హంగులతో ప్రారంభమైన తమ కొత్త మల్టీప్లెక్స్ ఎ ఎం బి సినిమాస్ లో స్పైడర్ మాన్ ఇన్ టూ ద స్పైడర్ వెర్సే చిత్రం విడుదలకు ముందే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని, సోనీ పిక్చర్స్ ఇండియా సంయుక్తంగా అనాథ పిల్లల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

స్పైడర్ మాన్ ఇన్ టూ ద స్పైడర్ వెర్సే చిత్రం ఈ రోజు విడుదలైంది. 150 మంది కి పైగా పిల్లలు ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ ని వీక్షించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఎ ఎం బి సినిమాస్ లో ఈ చిత్రాన్ని 3D లో చూడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని పిల్లలు తమ సంతోషం పంచుకున్నారు. నమ్రత చిన్నారులతో ప్రత్యేకంగా సమయం గడిపి వారితో కలిసి కబుర్లు చెప్పటం వారికి మరింత ఆనందాన్నిచ్చింది. పలువురు మీడియా ప్రతినిదులు కూడా తమ కుటుంబం తో ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు.