రజనీకాంత్ అంటే క్లాస్!
రజనీకాంత్ అంటే స్టైల్!
రజనీకాంత్ అంటే బాస్!
రజనీకాంత్ అంటే మాస్!
రజనీకాంత్ అంటే హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్!
రజనీకాంత్ లో క్లాసు.. మాసు… బాసు… హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్సు… ఒకేసారి చూపిస్తే? ‘దర్బార్’ మోషన్ పోస్టర్!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గజిని, స్టాలిన్, తుపాకీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి అరుణ్ అరుణాచలం పాత్రలో నటిస్తున్నారు. గురువారం సాయంత్రం ‘దర్బార్’ మోషన్ పోస్టర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. “రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనంటే నాకు ఎప్పటికీ అభిమానం, గౌరవం ఉంటాయి. దర్శకుడు మురుగదాస్ గారికి, మిగతా చిత్ర బృందానికి నా అభినందనలు” అని మహేష్ బాబు అన్నారు.

‘దర్బార్’ మోషన్ పోస్టర్ లో రజనీకాంత్ ప్రతినాయకులపై కత్తి దూసే దృశ్యానికి అభిమానుల నుండి అద్భుత స్పందన లభిస్తోంది. అందులో రజనీ స్టైల్, మాస్ అప్పీల్ అందరిని ఆకట్టుకుంటుంది. రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ రజినీకాంత్ రాయల్ లుక్, మోషన్ పోస్టర్ ట్రెండింగ్ టాపిక్.

రజనీకాంత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర తారాగణం.

ఈ చిత్రానికి పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి, ఫైట్స్: పీటర్ హెయిన్, రామ్ లక్ష్మణ్, లిరిసిస్ట్: వివేక్, ఆర్ట్ డైరెక్షన్: టి సంతానం, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, సంగీతం: అనిరుద్ రవిచంద్రన్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రచన దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్, నిర్మాత: సుభాస్కరన్.