కరీంనగర్  దగ్గర ఒక చిన్న గ్రామం లో  పుట్టి ఎలక్ట్రికల్ &  ఎలక్ట్రానిక్  ఇంజనీరింగ్ తో చదువులో రాణించి సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీ కి వచ్చి సీరియల్స్ లో సినిమా లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తీరిక సమయంలో కథలు రాసుకుంటూ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించాలని ఒక్క సామాజిక అంశంతో “కలియుగ” అని చిత్రాన్ని దర్శకత్వం వహించారు మాధవ తిరుపతి. సినిమా విడుదలై అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహిళా సంఘాలు సైతం కలియుగ సినిమాని మెచ్చుకుంటున్నారు.

 ఈ సంధర్భంగా దర్శకుడు తిరుపతి మాట్లాడుతూ  “కలియుగ సినిమా  నాకు తెలిసిన  వ్యక్తుల్లో ఒక్కరికి జరిగిన నిజమైన సంఘటన. ఆ ఘటన నన్ను మానసికంగా  చాలా కలిచివేసింది. ఆ సంఘటననే కమర్షియల్ అంశాలతో మంచి స్క్రీన్ ప్లే తో కలియుగ సినిమాగా చేశా.

అందరు  డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది  అంటున్నారు ?

దర్శకత్వం అనేది ఒక టెక్నికల్ జ్ఞానమే కాదు , మనుషులు వాళ్ళ మనసులు, సామాజిక అంశాలు మీద అవగహన కూడా మంచి దర్శకుని చేస్తాయి. కలియుగ సినిమా లో ఆ అంశాలే నాకు సహాయపడ్డాయి . ఏ కథాశం అయినా చివరి 5 నిమిషాలవరకు ప్రేక్షకుడు ఉత్కంఠంగా  చూడటానికి చేసే ప్రయత్నమే స్క్రీన్ ప్లే. ప్రతి పాత్ర కథలో కలిసిపోయి ఉండాలి  అప్పుడే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అయి  అన్ని కలియుగ సినిమా లో కుదిరాయి.

సినిమా అందరు చాలా బాగుంది అంటున్నారు కానీ పబ్లిక్ కి రీచ్ కాలేదు ?

ఆర్ధిక ఇబ్బందులే అందుకు కారణం. ఎక్కువ థియేటర్ లలో  విడుదల చేయలేకపోయాము . కానీ చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అని అంటున్నారు . మీడియా మిత్రులు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు.

సినిమా విడుదల తర్వాత మీకు వచ్చిన ప్రసంశలు గురించి చెప్పండి ?

కామన్ ప్రేక్షకుడి దగ్గర నుంచి ఉన్నత అధికారులు, సామజిక వెత్తలు, విద్యావేత్తలు అందరు కలియుగ సినిమా చాలా బాగుంది అన్ని అన్నారు. ముఖ్యగా మా నాన్న గారు కంటతడి తో చాలా గొప్ప సినిమా తీసావురా అని అన్నారు.

సామజిక అంశాల మీద మీకు మక్కువ ఎక్కువ అనుకుంటా ?

సమాజంలో మనం గమనించినవి మనకు తెలియకుండా మనం రాసే కథలలో ఇమిడిపోతాయి. ఆ విషయాలు ప్రేక్షకుడికి నచ్చే విధంగా చిత్రీకరిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. సామజిక అంశాలు మన నిజజీవితం కి దగ్గరగా ఉంటాయి కనుక ప్రేక్షకుడికి సినిమా నాచే అవకాశం ఎక్కువ అని నా అభిప్రాయం.

నటి నటులు అందరు చాలా బాగా నటించారు ?

నా కథని , వాళ్ళ పాత్రని బాగా అర్ధం చేసుకున్నారు బాగా నటించారు. వాళ్ళు మంచి నటులుగా పేరు తెచ్చుకోవటం దర్శకుడిగా నాకు సంతోషం. పింగ్ పాంగ్ సూర్య, స్వాతి, శశి కుమార్  అందరు చాలా బాగా నటించారు.

మీ తర్వాత సినిమా గురించి చెప్పండి ?

కొందరు నిర్మాతలకి కథలు చెప్పాను. చేర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నా తదుపరి చిత్రం గురించి పూర్తీ వివరాలతో మీ ముందుకు వస్తాను.