యంగ్ టాలెంటెడ్ రైటర్ ప్రసన్న కుమార్, మౌనికల వివాహం నిన్న రాత్రి 8 :45 ని లకు రెవెన్యూ కల్యాణ మండపం(మచిలి పట్నం) నందు కొద్ది మంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ వివాహానికి దర్శకుడు త్రినాద్ రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్ తదితరులు హాజరయ్యారు.

‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ త్వరలోనే రవి తేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీ బల్ ప్లేయర్ అరికపూడి రమణ రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు.