సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.


 అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 793k  డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.