భారత దేశ స్వాతంత్ర పోరాటం ఎవ్వరూ మరిచిపోలేనిది. చివరి దశలో మరి కొంతమంది స్వార్థపరుల కుట్రలకి గురి అయినా, 1857 సిపాయిల తిరుగుబాటు తో మొదలుపెట్టి అంతకు ముందు కూడా, అనేక రాజ్యాలు మరియు ప్రజలు వీరోచితంగా స్వాతంత్ర సంగ్రామానికి ముందుకు తీసుకువెళ్లారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తెరకెక్కించారు. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ తన లింగ సినిమాలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో భారత దేశం ఎంత సుసంపన్నంగా, సంపదలతో తులతూగేదో చూపించారు.

భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది కేవలం ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు. వాళ్లలో ఏ ఒక్క అమరవీరుడి కథ ని మనం తెలుసుకున్నా, మన గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.

సైరా నరసింహారెడ్డి సినిమా ఇచ్చిన స్ఫూర్తితో, కళలకు కాణాచి అయిన తెనాలి పట్టణంలో 1909 లో జరిగిన అనేక యదార్థ సంఘటన ల ఆధారంగా, అప్పటి తెనాలి ప్రాంతవాసులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో నేపథ్యంలో “వీరస్థలి తెనాలి” అనే ఒక డాక్యుమెంటరీ రూపుదిద్దుకోనుంది.

ఒకానొక సమయంలో బ్రిటీష్ సైనికులు చెన్నైకి వెళ్తూ మార్గమధ్యంలో తెనాలి నుండి వెళ్ళవలసి ఉండగా, ఒకానొక స్వాతంత్ర సమరయోధుడు వాళ్ళ పై యుద్ధం ప్రకటించి బాంబులతో దాడి చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమంది సొంత వాళ్లే అతని పట్టించి కుట్ర చేస్తే అతనిని అండమాన్ జైలు కు తరలిస్తారు.

ఈస్టిండియా కంపెనీ అతనికి ఉరి శిక్ష విధించిన నేపథ్యంలో, తెలుగు జాతి ముద్దుబిడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు అతని తరుపున కేసు వాదించడానికి పూనుకుంటాడు.

మరి ఆ కేసు విజయవంతం అయిందా.?

ఉరిశిక్ష నుంచి ఆ దేశభక్తులు తప్పించుకోగలిగారా.?

అతనితోపాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అతని స్నేహితులు ఏమయ్యారు.?

ఆ సంఘటనతో వణికిపోయిన బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత తెనాలి లో ఎలాంటి పరిస్థితులు సృష్టించారు.

ఒక తెలుగువాడు పేల్చిన బాంబు శబ్ధం పేలిస్తే జర్మనీ దాకా ఎలా ప్రతిధ్వనించింది.? టూకీగా ఇదే డాక్యుమెంటరీ సారాంశం.

పలు సినిమాలకు కళా దర్శకత్వం వహించడంతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ అయిన కనపర్తి రత్నాకర్ ఈ డాక్యుమెంటరీ కు దర్శకత్వం వహిస్తున్నారు.

రచయిత అయినాల మల్లేశ్వరరావు, విజయవర్ధన్, గుంటూరు విజయ్ లాంటి సాంకేతిక నిపుణులు ఈ డాక్యుమెంటరీ కి పని చేస్తున్నారు. “రా కిట్టు” అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చార్లీ, వెంకట్ అనే నటులు ఈ డాక్యుమెంటరీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ డాక్యుమెంటరీ విజయవంతం అయ్యి భారత స్వాతంత్ర సంగ్రామం మీద ఇలాంటి వీరోచితమైన గాథలు ఇంకా రావాలని కోరుకున్నాం