రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమమని అందుకే మేము కూడా అందులో భాగం కావాలని భావించి మా చెరసాల చిత్ర యూనిట్ మొక్కలు నాటిందని తెలిపాడు దర్శకుడు రాంప్రకాష్ గుణ్ణం. ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై మాదినేని సురేష్ – సుధారాయ్ గుణ్ణం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీజిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శిల్పా దాస్ , నిష్కల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  లవ్ , కామెడీ , ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకు తోడు కొంత హర్రర్ ఎలిమెంట్ కూడా మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించామని తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు. ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండియా క్వీన్ 2018 కేరళ విన్నర్ గా నిలిచిన శిల్పా దాస్ ని ఒక హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని అలాగే మరొక హీరోయిన్ గా నిష్కల నటిస్తోందని మొత్తంగా నాలుగు జంటల మధ్య సాగే కథ అని , మా చిత్ర మోషన్ పోస్టర్ ని నిర్మాత రాజ్ కందుకూరి గారు ఆవిష్కరించడం , అలాగే దర్శక నిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ మాకు బెస్ట్ విషెష్ అందిస్తూ టైటిల్ లోగో లాంఛ్ చేయడం సంతోషంగా ఉందన్నారు దర్శకుడు ఛాయాగ్రాహకుడు రాంప్రకాష్ గుణ్ణం.చిత్ర నిర్మాత మాదినేని సురేష్ మాట్లాడుతూ : రాంప్రకాష్ చెప్పిన కథ నచ్చడంతో మరో మాట లేకుండా ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నాం. రష్ చూసుకున్నాక దర్శకుడు చెప్పిన దానికంటే చాలా బాగా తీసాడని అర్థమైంది నటీనటులు , సాంకేతిక నిపుణులు మాకు అందరూ మంచి సహకారం అందించారు దాంతో అనుకున్నట్లుగానే మా సినిమాని కంప్లీట్ చేసాం. తప్పకుండా మొదటి ప్రాజెక్ట్ తోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. హీరో శ్రీజిత్ హీరోయిన్లు శిల్పా దాస్ , నిష్కల మాట్లాడుతూ దర్శక నిర్మాతలు చెరసాల చిత్రంలో మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’ తెలిపారు. శంకర్ తమిరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను నాగ్ ఎడిటర్.